ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kommineni Srinivasa Rao | జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్

    Kommineni Srinivasa Rao | జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kommineni Srinivasa Rao | జర్నలిస్ట్​ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్​ మంజూరు చేసింది. ఇటీవల ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన ఓ ప్రోగ్రాంలో మరో వ్యాఖ్యత కృష్ణంరాజు అమరావతి మహిళల(Amaravati Womens) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏపీలోని తుళ్లూరు పోలీసులు(Thullur Police) కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు(Krishnam Raju)ను అరెస్ట్​ చేశారు. తన అరెస్ట్​పై కొమ్మినేని సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వెంటనే బెయిల్​ మంజూరు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

    కొమ్మినేని బెయిల్​ పిటిషన్​ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి సబంధం లేదని తెలిపింది. వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు ఆర్టికల్‌ 32 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారన్న వాదనలతో సుప్రీంకోర్టు(Supreme Court) ఏకీభవించింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్‌ కోర్టు చూసుకుంటుందని పేర్కొంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...