ePaper
More
    Homeక్రైంTamil Nadu | కారు–లారీ ఢీ : నలుగురి మృతి.. జడ్జికి తీవ్రగాయాలు

    Tamil Nadu | కారు–లారీ ఢీ : నలుగురి మృతి.. జడ్జికి తీవ్రగాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tamil Nadu | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు–లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తంజావురుకు చెందిన ఓ న్యాయమూర్తి(Thanjavur Judge) తీవ్రంగా గాయపడ్డారు.

    తంజావూరుకు చెందిన జస్టిస్ పూరణజయ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు వ్యక్తులు తిరుచెందూర్ ఆలయం(Thiruchendur Temple)లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శుక్రవారం కారులో తంజావూరుకు బయలుదేరారు. వారి కారు ఎట్టాయపురం సమీపంలోని తూత్తుకుడి-మధురై రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

    ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అరుప్పుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రి(Aruppukottai Government Hospital)కి తరలించారు.మృతి చెందిన వారిలో తంజావూరుకు చెందిన న్యాయవాది ధనంజయన్ రామమూర్తి, కారు డ్రైవర్ వసురామనాథన్, న్యాయమూర్తికి సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన మరో పోలీసు ఉన్నారు. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి పూరణ జయానంద్‌ తీవ్రంగా గాయపడ్డారు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...