ePaper
More
    HomeజాతీయంIran | ఇరాన్ - ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలతో విమాన రాకపోకలకు అంతరాయం

    Iran | ఇరాన్ – ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలతో విమాన రాకపోకలకు అంతరాయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran | ఇరాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్(Israel)​ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్​లోని కీలక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడులతో రెండు దేశాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్​ దాడులతో అప్రమత్తమైన ఇరాన్(Iran)​ ఇప్పటికే తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 16 ఎయిర్‌ ఇండియా విమానాల(Air India flights) రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరాన్‌ గగనతలం మూసివేతతో పలు విమానాలు వెనక్కి మళ్లాయి. మరికొన్ని విమానాలను అధికారులు ముందుగానే రద్దు చేశారు.

    Iran | మూడు గంటలు గాలిలోనే..

    ముంబయి నుంచి లండన్​ బయలు దేరిన ఎయిర్​ ఇండియా విమానం మూడు గంటలు గాలిలోనే చక్కర్లు కొట్టింది. శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబయి ఎయిర్‌పొర్ట్‌(Mumbai Airport) నుంచి AIC 129 విమానం లండన్​ బయలు దేరింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పచ్చిమాసియా ప్రాంతాల్లో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించాయి. దీంతో ఈ విమానం మూడు గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయి ఎయిర్‌పొర్ట్‌కు వచ్చింది. అయితే అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash)తో భయాందోళనలో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనలో మరింత భయపడియారు. విమానం గాలిలో ఉండటంతో ఆందోళన చెందారు. కాగా విమానం సురక్షితంగా ముంబయిలో ల్యాండ్​ కావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...