ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

    Ahmedabad Plane Crash | విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం యావత్​ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) టేకాఫ్​ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 265 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం అహ్మదాబాద్​ వచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడారు.

    Ahmedabad Plane Crash | క్షతగాత్రులకు పరామర్శ

    ప్రధాని మోదీ విమాన ప్రమాదం స్థలాన్ని పరిశీలించిన అనంతరం అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రి (Ahmedabad Civil Hospital)కి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ప్రధాని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా.. విమాన ప్రమాదంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్​ గేట్​ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్​ విశ్వాస్​ కుమార్​తో మోదీ మాట్లాడారు. ఆయన వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌(Gujarat CM Bhupendra Patel), కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Minister Rammohan Naidu) తదితరులు ఉన్నారు.

    Ahmedabad Plane Crash | నేడు అహ్మదాబాద్​కు బ్రిటిష్​ అధికారులు

    విమాన ప్రమాదంలో 53 మంది యూకే పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రిటిష్​ హైకమిషనర్​ అధికారులు(British High Commission Officers) కూడా అహ్మదాబాద్ చేరుకొని పరిశీలించనున్నారు. ప్రమాద వివరాలను వారు తెలుసుకోనున్నారు. మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు.

    Ahmedabad Plane Crash | మొత్తం 265 మంది మృతి

    విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానంలో 242 మంది ఉండగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విమానం మెడికల్​ కాలేజీ హాస్టల్​(Medical College Hostel)పై కూలడంతో అందులోని 24 మంది చనిపోయారు.

    Ahmedabad Plane Crash | మృతదేహాల అప్పగింత కోసం డీఎన్​ఏ పరీక్షలు

    విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అప్పగించడానికి అధికారులు డీఎన్​ఏ పరీక్షలు(DNA Tests) చేస్తున్నారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్​ సివిల్​ ఆస్పత్రిలో నిరీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాల పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారికి ఆహారం అందించడంతో పాటు, వసతులు కల్పిస్తున్నారు.

    Latest articles

    Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​...

    Nandamuri Balakrishna | క‌న్నీళ్లు పెట్టుకున్న బాల‌కృష్ణ‌… ఆయన‌ని ఎప్పుడు ఇలా చూడ‌లేదుగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nandamuri Balakrishna | నంద‌మూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెల‌కొంది. నందమూరి జయకృష్ణ సతీమణి...

    TTD Chairman | సాక్షి టీవీ, పత్రికపై టీటీడీ ఛైర్మన్​ పరువు నష్టం దావా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD Chairman | టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు (TTD Chairman BR Naidu)...

    Kamareddy SP | ఫేక్ ఆర్సీలతో కార్ల విక్రయాలు.. ఏడుగురి అరెస్ట్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఫేక్ ఐడీ కార్డులు (Fake ID cards), ఆర్సీలతో కార్లను అమ్ముతూ...

    More like this

    Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​...

    Nandamuri Balakrishna | క‌న్నీళ్లు పెట్టుకున్న బాల‌కృష్ణ‌… ఆయన‌ని ఎప్పుడు ఇలా చూడ‌లేదుగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nandamuri Balakrishna | నంద‌మూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెల‌కొంది. నందమూరి జయకృష్ణ సతీమణి...

    TTD Chairman | సాక్షి టీవీ, పత్రికపై టీటీడీ ఛైర్మన్​ పరువు నష్టం దావా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD Chairman | టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు (TTD Chairman BR Naidu)...