ePaper
More
    HomeజాతీయంPlane Crash | భర్త దగ్గరికి తొలిసారి వెళ్తూ.. విమాన ప్రమాదంలో యువతి మృతి

    Plane Crash | భర్త దగ్గరికి తొలిసారి వెళ్తూ.. విమాన ప్రమాదంలో యువతి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Plane Crash | అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్​ అయిన కొద్ది సెకన్లలోనే క్రాష్ అయింది. ఈ ఘటనలో విమానంతో పాటు ఎంతోమంది ఆశలు, కలలు కూడా కూలిపోయాయి. పెళ్లి తర్వాత తన భర్త దగ్గరికి తొలిసారి వెళ్తున్న ఓ యువతి విమాన ప్రమాదంలో మృతి చెందింది.

    రాజస్థాన్​లోని బలోత్రా(Balotra)కు చెందిన ఖుష్బు రాజ్‌పురోహిత్​కు జనవరి 2025లో వివాహం అయింది. ఆమె భర్త లండన్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత వారు లండన్​(London city)లోనే నివాసం ఉండాలనుకున్నారు. ఆ యువతి తన భర్తతో గొప్ప జీవితాన్ని ఊహించుకుంది. అయితే పెళ్లి తర్వాత ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఖుష్బు భర్త లండన్​ వెళ్లిపోయాడు. ఖుష్బు ఇక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో గురువారం తన భర్త దగ్గరికి తొలిసారి వెళ్లడానికి లండన్​ బయలుదేరింది.

    ఖుష్బు తండ్రి వచ్చి అహ్మదాబాద్​ విమానాశ్రయం(Ahmedabad Airport)లో ఆమెను దింపాడు. ఈ క్రమంలో ఎయిర్​ ఇండియా విమానంలో ఎక్కిన ఆమె ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి తన కూతరుతో ఎయిర్​పోర్ట్​లో ఫొటో దిగాడు. ఆ చిత్రాన్ని వాట్సాప్​ స్టేటస్​ పెట్టుకున్నాడు. లండన్​ వెళ్తున్న తన కూతురిని ఆశీర్వదించాడు. అల్లుడి దగ్గరకు వెళ్లి తమకు ఫోన్​ చేస్తుందనుకున్న కూతురు కొద్ది సేపటికి ప్రమాదంలో మరణించిందని తెలిసి గుండెలవిసేలా రోదించాడు ఆ తండ్రి.

    Latest articles

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా...

    Social Media | సోషల్ మీడియాకు బానిసయ్యారా.. ఇలా చేస్తే బయటపడొచ్చు…

    అక్షరటుడే, హైదరాబాద్ : Social Media | సోషల్ మీడియా.. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విడదీయరాని భాగం....

    More like this