ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad GGH | నిజామాబాద్​ జీజీహెచ్​లో ఒకరి సూసైడ్​

    Nizamabad GGH | నిజామాబాద్​ జీజీహెచ్​లో ఒకరి సూసైడ్​

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamabad GGH | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి ఆవరణలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. అర్ధరాత్రి తర్వాత సదరు వ్యక్తి ఆస్పత్రిలో ఉరివేసుకుని సూసైడ్​కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయిలు(37) భార్య సంగీత ఈ నెల 6న నిజామాబాద్​ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. కాగా.. వారికి కుమారుడు జన్మించి మృతి చెందాడు. అయితే సంగీత పల్స్​ రేట్​ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. భార్య ఆస్పత్రిలో ఉండగా చేతిలో డబ్బులు లేకపోవడం.. అప్పటికే ఇతరుల వద్ద తీసుకున్న అప్పు ఎలా చెల్లించాలో తెలియకపోవడంతో పాటు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...