ePaper
More
    HomeజాతీయంSanjay Kapoor | తేనెటీగ నోట్లోకి వెళ్లి స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌

    Sanjay Kapoor | తేనెటీగ నోట్లోకి వెళ్లి స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sanjay Kapoor | గ‌త మూడు రోజులుగా విషాద వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. తాజాగా బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్‌(star heroine)గా ఓ వెలుగు వెలిగిన కరిష్మా క‌పూర్ (Karishma kapoor) మాజీ భ‌ర్త సంజ‌య్ క‌పూర్ క‌న్నుమూశారు. 53 ఏళ్ల వ‌య‌స్సులో ఆయ‌న క‌న్నుమూయ‌డం అంద‌రిని బాధిస్తోంది.

    కరిష్మా కపూర్ మాజీ భర్త, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు కాగా.. ఆయన నిన్న‌ పోలో (POLO) ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. ఈ దురదృష్టకర ఘటన గార్డ్స్ పోలో క్లబ్‌ (Guards Polo Club)లో చోటుచేసుకుంది. ఆయన మరణవార్త వ్యాపార, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలో ఆడుతున్న సమయంలో సంజయ్ కపూర్ నోట్లోకి అక‌స్మాత్తుగా ఒక తేనేటీగ (Honey BEE) వెళ్లిందట.

    Sanjay Kapoor | తీవ్ర విషాదం..

    తేనెటీగ వెళ్లడంతో తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే ఆటను నిలిపివేసి, వైద్య సహాయం అందించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆయనను బతికించలేకపోయారు.

    1990ల‌లో బాలీవుడ్‌ను ఏలిన క‌రిష్మా క‌పూర్ 2003లో సంజ‌య్ క‌పూర్‌ను వివాహం చేసుకుని లండ‌న్‌లో సైటిల్ అయ్యింది. వీరికి ఇద్ద‌రు పిల్లలు. అయితే 2014లో వీరిద్ద‌రూ విడిపోయి 2016లో డైవ‌ర్స్ తీసుకోగా సంజ‌య్ క‌పూర్ ప్రియా స‌చ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

    సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ రంగంలో కీలకమైన వ్యక్తి. ఆయన సోనా కామ్‌స్టార్ (Sona Comstar) సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ, ఆ కంపెనీని ఆటోమోటివ్ విడిభాగాల తయారీలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన భాగాల ఉత్పత్తిలో ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు.

    అలాగే ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) అధ్యక్షుడిగా కూడా ఆయన తన నాయకత్వ పటిమతో, దార్శనికతతో పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేశారు. సంజయ్ కపూర్ తన మరణానికి కొన్ని గంటల ముందు.. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.

    “అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వార్త న‌న్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని సంజయ్​ తన పోస్టులో రాసుకొచ్చారు. ఆయన చివరి సందేశం ఇదే కావడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...