ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael Attack | ఇరాన్​ అణు స్థావరాలపై ఇజ్రాయెల్​ భీకర దాడి.. ప్రపంచ వేదికపై మరో...

    Israel Attack | ఇరాన్​ అణు స్థావరాలపై ఇజ్రాయెల్​ భీకర దాడి.. ప్రపంచ వేదికపై మరో కొత్త యుద్ధానికి తెర లేవనుందా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel Attack | ఇజ్రాయెల్ Israel ఇరాన్‌(Iran)పై భీకర దాడికి పాల్పడింది. అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. శుక్రవారం తెల్లవారు జామునే ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబులు వేయడంతో రాజధాని టెహ్రాన్‌లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అనేక చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్న తర్వాత ఇరాన్ లోని అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ అణుశక్తిగా మారే దిశగా పయనిస్తున్న తరుణంలో.. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.

    Israel Attack : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఏమన్నారంటే..

    ఇరాన్​పై దాడి గురించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు (Israeli Prime Minister Netanyahu) వివరణ ఇచ్చారు. ఇజ్రాయెల్ టార్గెటెడ్ ఆపరేషన్ ను ప్రారంభించిందని తెలిపారు. ఇరాన్ అణు శాస్త్రవేత్తల (nuclear scientists)ను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడితో ఇరాన్‌కు భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు. అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. కాగా, ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత.. ఇజ్రాయెల్ తన వైమానిక స్థావరాలను మూసివేసింది.

    Israel Attack : హెచ్చరించిన విధంగానే…

    ఇరాన్ అతి త్వరలో అణుశక్తిగా మారబోతోందని ఇటీవలి నిరంతరం నివేదికలు వెల్లడిస్తూ వచ్చాయి. ఇరాన్ ఆ దిశలో వేగంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి అనుమతించబోమంటూ ఇజ్రాయెల్ సంవత్సరాలుగా హెచ్చరిస్తూ వచ్చింది. తాజాగా ఇరాన్​ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి.. తమ హెచ్చరిక నిజమని ఇజ్రాయెల్​ నిరూపించుకుంది.

    Israel Attack : ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా…

    తమ దాడి తర్వాత ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్(Israeli Defense Minister Katz) స్పష్టంగా చెప్పారు. ఇరాన్ దాడి చేస్తుందని భావించే తమ దేశంలో క్షిపణులు(Missiles), డ్రోన్‌(drones)లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించే ప్రత్యేక ఉత్తర్వుపై ఇప్పటికే కాట్జ్ సంతకం చేసినట్లు తెలిసింది.

    Israel Attack : హెచ్చరిక జారీ!

    ఇరాన్ లో దెబ్బతిన్న ప్రదేశాల గురించిన సమాచారం ఆ దేశం పూర్తిగా వెల్లడించలేదు. ఎన్ని అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయనే విషయంపై స్పష్టత లేదు. కానీ, పశ్చిమ టెహ్రాన్‌(West Tehran)లోని చిట్గర్ పొరుగు ప్రాంతం నుంచి పొగలు ఎగసిపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ దాడి తర్వాత ఎరామ్‌లో హెచ్చరిక జారీ చేయబడినట్లు తెలిసింది. తాజా పరిణామల నేపథ్యంలో ప్రపంచ వేదికపై మరో కొత్త యుద్ధం మొదలు కాబోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...