ePaper
More
    Homeబిజినెస్​pre market analysis | ఎరుపెక్కిన గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌గా గిఫ్ట్‌ నిఫ్టీ

    pre market analysis | ఎరుపెక్కిన గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌గా గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: pre market analysis | జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions)తో మార్కెట్లు ఎరుపెక్కాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడికి దిగడంతో ప్రధాన స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.

    pre market analysis | యూఎస్‌ ఫ్యూచర్స్‌లో నష్టాలు..

    గత ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికా మార్కెట్లు(American markets) పాజిటివ్‌గా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ(S&P) 0.38 శాతం పెరగ్గా.. నాస్‌డాక్‌ 0.24 శాతం లాభపడింది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌(Dow Jones Futures) నష్టాల్లోకి జారుకుంది. 1.60 శాతం నష్టంతో కదలాడుతోంది.

    pre market analysis | మిక్స్‌డ్‌గా ముగిసిన యూరోప్‌ మార్కెట్లు..

    యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.23 శాతం పెరగ్గా.. డీఏఎక్స్‌ 0.78 శాతం, సీఏసీ 0.14 శాతం నష్టపోయాయి.

    pre market analysis | ఆసియా మార్కెట్లలో రక్తపాతం..

    ఆసియా మార్కెట్(Asian markets)లు శుక్రవారం ఉదయం నెగెటివ్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 8.20 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.35 శాతం, కోస్పీ 1.24 శాతం, హంగ్‌సెంగ్‌ 0.74 శాతం, షాంఘై 0.66 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.61 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.48 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 1.20 శాతం నష్టంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 3,831 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐ(DII)లు మాత్రం రూ. 9,393 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.97 నుంచి 0.92 కు తగ్గింది. విక్స్‌(VIX) 2.54 శాతం పెరిగి 14.02 వద్ద ఉంది.
    • ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ఎయిర్‌స్ట్రైక్స్‌తో క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు ఏకంగా 9.61 శాతం పెరిగి 74.58 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు తగ్గి 85.60 వద్ద ఉంది.యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.16 శాతం పెరిగి 98.08కి, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.60 శాతం తగ్గి 4.33 కు చేరాయి.
    • మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. టెహ్రాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించే కారణంతో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేసింది. ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింటోంది.
    • అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియడం లేదు. జూలై 9 సమీపిస్తుండడంతో వాణిజ్య ఒప్పందాలు, సుంకాల విషయంలో తిరిగి బెదిరింపులకు పాల్పడుతుండడంతో అనిశ్చితి నెలకొంది.
    • భారత్‌ సీపీఐ ఇన్ఫ్లెషన్‌(CPI Inflation) గణనీయంగా తగ్గింది. గతేడాది మేలో 4.8 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 2.82 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్టం.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...