ePaper
More
    HomeజాతీయంPlane Crash | విమానం కూలిన ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

    Plane Crash | విమానం కూలిన ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)​లో జరిగిన ఫ్లైట్ క్రాష్​లో 242 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 భారతీయులు(Indians), 53 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్​ Portuguese, ఒక కెనెడియన్​ Canadian ఉన్నారు.

    కాగా, మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. రాజస్థాన్ బన్స్వారా Banswara, Rajasthan నుంచి లండన్ London ​కు వెళ్తున్న ప్రతీక్ జోషీ- డాక్టర్ కోమీ వ్యాస్ దంపతులు, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విమానంలో వారు నవ్వుతూ తీసుకున్న ఆఖరి సెల్ఫీ అందరినీ చెమ్మగిల్లేలా చేస్తోంది. కాగా.. మృతదేహాలకు DNA పరీక్షల అనంతరం వారివారి కుటుంబాలకు అప్పగించనున్నారు. ఇందుకోసం సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తమవారి చివరి చూపుకోసం మృతుల తాలుకా వేలాది మంది కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని విలపిస్తున్నారు.

    plane crash : ఆరేళ్ల కల నెరవేరుతుందనుకుంటే..

    ప్రతీక్ జోషి ఆరు సంవత్సరాలుగా లండన్‌లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన ఆయన, తన భార్య, ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి విదేశాల్లో జీవించాలని ఎన్నో కలలు కన్నారు. ప్రతీక్​ లండన్​లో ఉంటే.. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు భారతదేశంలోనే ఉండేవారు.

    సంవత్సరాలుగా వేచి ఉన్న తర్వాత తన కల చివరకు నెరవేరే సమయం వచ్చిందని ప్రతీష్​ ఎంతో సంతోషించారు. రెండు రోజుల క్రితమే ఉదయపూర్‌లో ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

    విదేశాలకు వెళ్లేందుకు ఉదయమే బ్యాగులు సర్దుకున్నారు. తమ భవిష్యత్తు గురించి కలలు కంటూ అందరికీ వీడ్కోలు పలికారు.

    ఎంతో ఉత్సాహంతో ఐదుగురు సభ్యుల కుటుంబం లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 171 ఎక్కింది. ఫ్లైట్​లో వారు సెల్ఫీ తీసుకున్నారు. దానిని బంధువులకు కూడా పంపారు. కొత్త జీవితానికి ప్రయాణం మొదలెట్టామని అనుకున్నారు. కానీ, తిరిగిరాని లోకానికి వెళ్తున్నట్లు వారికి తెలియదు.

    ఫ్లైట్​ క్రాష్​తో కొన్ని క్షణాల్లోనే వారి జీవిత కలలు బూడిదగా మారాయి.

    More like this

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...