ePaper
More
    HomeజాతీయంPlane Crash | పని చేయని ఏసీ.. సమస్యలతో ఢిల్లీ నుంచి వచ్చి ప్రమాదానికి గురైన...

    Plane Crash | పని చేయని ఏసీ.. సమస్యలతో ఢిల్లీ నుంచి వచ్చి ప్రమాదానికి గురైన విమానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్​లో విమాన ప్రమాదం (Ahmedabad Plane crash) లో అందులో ఉన్న వారు మొత్తం మరణించినట్లు అధికారులు తెలిపారు. దేశ చరిత్రలో ఇది పెద్ద విమాన ప్రమాదం. తీవ్ర విషాదం నింపిన ఈ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

    ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ (Delhi to Ahmedabad) వచ్చింది. అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఓ ప్రయాణికులు విమానంలో సమస్యలు ఉన్నట్లు ప్రమాదానికి ముందే ట్వీట్​ చేశాడు. ఏసీ పని చేయడం లేదని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వీడియో తీసి ఎయిర్​ ఇండియా (Air India)కు ట్యాగ్​ చేశాడు. అయితే ఆయన అహ్మదాబాద్​లో దిగిపోయాక ప్రమాదం జరిగింది. కాగా విమానంలో ఏసీలు పనిచేయడం లేదంటే.. సిబ్బంది టేకాఫ్​కు ముందు పూర్తి స్థాయిలో చెక్​ చేయలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీట్‌కి ఉండే స్క్రీన్లు కూడా ఆన్ అవ్వడంలేదని, అసలు ఫ్లైట్ అంతా ఏదో తేడాగా ఉందన్నట్లు అతడు అనుమానం వ్యక్తం చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...