అక్షరటుడే, ఇందూరు: TPPC Chief | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ఇటీవల ప్రకటించింది. ఇందులో జిల్లా కేంద్రానికి చెందిన రాంభూపాల్‌కు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పదవి దక్కింది. దీంతో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్‌ను సన్మానించారు. తనకు పదవీ రావడంలో కృషి చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ చీఫ్‌ను కలిసిన వారిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మెంబర్ జీవీ రామకృష్ణ, మనోహర్, భాస్కర్, నరేందర్, నాగరాజు, సంతోష్, పుప్పాల రవి, అజహర్ తదితరులు ఉన్నారు.