ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Population | పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. జనాభా పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం

    Population | పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. జనాభా పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Population | మన దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. సగటు (average) సంతానోత్పత్తి రేటు 2.1 కాగా, మన దేశంలో 1.90గా నమోదైంది. ఐదారేళ్లలో ఈ రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(UNFPA) ప్రపంచ జనాభా నివేదిక (World Population Report) ప్రకారం, ఇండియా జనాభా 2025లో 1.46 బిలియన్లకు చేరుకుంది. అయితే, మన దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు(TFR) 1.9కి పడిపోయింది. ఇది తరతరాలుగా కొనసాగుతున్న స్థిరమైన జనాభా వృద్ధికి అడ్డంకిగా మారుతుందన్న ఆందోళన నెలకొంది.

    Population | నిర్ణీత స్థాయి కంటే తక్కువ..

    2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(National Family Health Survey) ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0గా నమోదైంది. అది 2025 నాటికి 1.9కి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక దేశం తన జనాభాను నిర్వహించడానికి మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) సగటున 2.1లో ఉండాలి. కానీ ఇండియాలో ఇది నిర్ణీత స్థాయి కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఇది రానున్న రోజుల్లో భారతదేశ జనాభా వృద్ధిపై (India population growth) గణనీయమైన ప్రభావం చూపనుంది. సంతానోత్పత్తి తగ్గిపోతే జనాభా పెరుగుదల తగ్గిపోవడం సహజంగానే జరుగుతుంది. రానున్న కొన్నేళ్లలో ఇది తీవ్రమైన సంక్షోభంగా మారే ప్రమాదముంది.

    Population | జీవన శైలి ప్రధాన కారణం..

    ఇండియాలో సంతానోత్పత్తి రేటు పడిపోవడానికి కారణం మారిన జీవనశైలి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా అలవాట్లు మారిపోయాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవనం, నిద్ర లేమి, పనిభారం, మానసిక ఒత్తిళ్లు వంటివి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పౌష్టికాహారం స్థానాన్ని జంక్ ఫుడ్(Junk food) ఆక్రమించింది. శారీరక శ్రమ తగ్గిపోయింది. పనిభారం, మానసిక ఒత్తిళ్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. కంటి నిండా నిద్ర కరువైంది. మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీ వంటివి కూడా సంతానోత్పత్తి తగ్గిపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

    Population | మార్చుకుంటే మంచిదే..

    అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నప్పుడు, అది సంతానోత్పత్తి స్థాయిని ప్రభావితం చేసే అవకాశం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరూ తమ వ్యూహాత్మక జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.. ఇందులో రోజువారీ పోషకాహారం (daily nutrition) ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. పురుషులు, మహిళలు యాంటీఆక్సిడెంట్లు, బి-విటమిన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, సెలీనియం వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు. ఇవి హార్మోన్ల నియంత్రణ పనితీరుకు చాలా అవసరం. ఇవి పురుషుల్లో వీర్య కణాల (sperm cells) ఉత్పత్తికి దోహదపడతాయి. అయితే నేటి ఆధునిక ఆహార శైలి అల్ట్రా-ప్రాసెస్డ్, పోషక-లోపంతో ఉండడం మూలంగా సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుతున్నాయి. అధిక బరువు ఉండడం వల్ల మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు(health problems) వస్తాయని, ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారంతో పాటు వ్యాయామం, ఏరోబిక్స్, యోగా వంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది భారతీయ మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణమైన పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)ను నిర్వహించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

    Population | ధూమపానం, మద్యపానం వద్దు..

    సిగరెట్ తాగడం (smoking) పురుషులు, మహిళలు ఇద్దరికీ చాలా హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది అండం, వీర్యకణాల్లోని DNAని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందువల్ల, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం (Alcohol consumption) వల్ల హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి, వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, మద్యం సేవించకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులతో పాటు ఇతర కంపెనీల్లో పని చేసే వారు, సగటు పౌరులు కూడా కాలంతో పోటీ పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో ఒత్తిళ్లకు గురవుతున్నారు. టెన్షన్స్, హార్మోన్ల అసమతుల్యతకు, సంతానోత్పత్తి మార్పులకు దారితీస్తుంది కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది. ఇక, కంటి నిండా నిద్రపోవడం కూడా సంతానోత్పత్తి పెరగడానికి సహాయపడుతుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...