ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | ప్రమాదానికి ముందు పైలట్ నుంచి 'మేడే కాల్'.. అంతలోనే కూలిన...

    Ahmedabad Plane Crash | ప్రమాదానికి ముందు పైలట్ నుంచి ‘మేడే కాల్’.. అంతలోనే కూలిన ఫ్లైట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ahmedabad Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల‌కే కుప్ప‌కూల‌డం అంద‌రిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని (former Gujarat CM Vijay Rupani) సైతం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు విచారణ చేస్తున్నాయి.

    Ahmedabad Plane Crash | దారుణం..

    ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం… బోయింగ్ 787 రకానికి చెందింది. ఇది అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం(Sardar Vallabhbhai Patel International Airport) నుండి రన్‌వే 23 మీదుగా మధ్యాహ్నం 1:38 గంటలకు లండన్ (London) గ్యాట్‌విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. టేకాఫ్ (take-off) సమయంలో విమానానికి పక్షి ఢీకొని ఉండవచ్చని, దాని కారణంగా విమానం టేకాఫ్‌కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అంటున్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

    అయితే ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం నుండి ‘మేడే కాల్’ (Mayday call) జారీ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే ‘మేడే కాల్’ అంటారు. కాగా.. విమానంలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...