ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | గుజ‌రాత్ ఘోర విమాన ప్ర‌మాదం.. క్యాన్సిల్ అయిన క‌న్న‌ప్ప ఈవెంట్

    Ahmedabad Plane Crash | గుజ‌రాత్ ఘోర విమాన ప్ర‌మాదం.. క్యాన్సిల్ అయిన క‌న్న‌ప్ప ఈవెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని(Meghani)లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల‌లో ఈ ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం(Aeroplane) కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది, ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్సులలో హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తున్నారు.

    Ahmedabad Plane Crash | ఘోర ప్ర‌మాదం..

    అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport)కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్​గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్​కు వెళ్తున్నట్టు సమాచారం. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Aviation Minister Rammohan Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గుజరాత్ సీఎంతో ఫోన్​లో మాట్లాడారు.

    ఈ ప్రమాదం కారణంగానే కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్(Kannappa trialer Event)ను క్యాన్సిల్ చేస్తున్నామని, ట్రైలర్ రిలీజ్​ను ఒకరోజు వాయిదా వేస్తున్నామని, మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ మంచు విష్ణు (Manchu Vishnu) తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఈ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...