ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​లో జరిగి ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సమీక్షించారు. కేంద్రమంత్రులు అమిత్‌షా(Union Ministers Amit Shah), రామ్మోహన్‌(Rammohan)కు మోదీ ఫోన్ చేశారు. విమాన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.ప్రమాదం విషయమై ఇప్పటికే హోం మంత్రి అమిత్​ షా అధికారులతో మాట్లాడారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. అమిత్​ షా కూడా అహ్మదాబాద్​ వెళ్లనున్నారు.

    Ahmedabad Plane Crash | విమానంలో 169 మంది భారతీయులు

    ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌ దేశస్థులు, ఒకరు కెనడియన్‌ ఫ్లైట్​లో ప్రయాణిస్తున్నారు. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    Ahmedabad Plane Crash | 110 మంది మృతి!

    విమాన ప్రమాదంలో ఇప్పటికే 110 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహాయక బృందాలు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంతో సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport) మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    Ahmedabad Plane Crash | బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

    ఎయిర్​ ఇండియా విమానం కూలిపోవడంపై టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్(Tata Sons Chairman N Chandrasekaran)​ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. బాధితులకు అండగా ఉంటామన్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...