Ram charan
Ram Charan | చాలా రోజుల త‌ర్వాత యాక్టివ్ మోడ్‌లోకి పీకే క్రియేటివ్ వ‌ర్క్స్‌.. రామ్ చ‌ర‌ణ్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ram Charan | ఇండ‌స్ట్రీలో క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. ఊహించ‌ని కాంబినేష‌న్స్ సెట్ అవుతుండ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్‌- త్రివిక్ర‌మ్ Trivikram కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుంద‌ని నెట్టింట ఓ వార్త వైర‌ల్ అయింది. రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఓకే అయితే వీరిది ఫ్రెష్ కాంబినేషన్ కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్​లోకి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా రానున్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఆర్సీ17 ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని అంటున్నారు. ప‌వ‌న్ నిర్మాణ సంస్థ పీకే క్రియేటివ్ వ‌ర్క్స్‌(PK Creative Works)తో పాటు హారిక హాసిని ఈ చిత్రాన్ని రూపొందించ‌నుంద‌ని అంటున్నారు. కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్‌లో ఉన్న పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి దూకుడు పెంచాల‌ని అనుకుంటుంద‌ట‌.

Ram Charan | ప‌వ‌న్ నిర్మాణ సంస్థ‌లో..

రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తన క్రేజ్​కు తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నెక్ట్స్ క్రేజీ లైనప్ ను సెట్ చేస్తున్నారు. కాగా.. రామ్ చరణ్ ఆర్సీ17 చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది. రామ్ చరణ్ ఆర్సీ17 ఏ దర్శకుడితో చేస్తారనేది మొన్నటి వరకు సస్పెన్స్ గా మారింది. ఓవైపు పుష్ప దర్శకుడు Sukumar అంటూ.. మరోవైపు త్రివిక్రమ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్​తో ఆర్సీ17 ప్రాజెక్ట్ లాక్ అయినట్టు గట్టిగా బజ్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

సుక్కూ- రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెట్టిన చ‌ర‌ణ్ దాని స్థానంలో త్రివిక్ర‌మ్‌(Trivikram)తో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ప్ర‌చారంలో నిజం లేద‌ని, సుకుమార్‌, చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని, ఈ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే ఏడాది త‌ప్ప‌కుండా మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. ఇక త్రివిక్ర‌మ్‌తో చ‌ర‌ణ్ Ram Cahran ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడ‌న్న‌ది నిజ‌మేన‌ని అయితే దీనికి సంబంధించి ఇంత వ‌ర‌కు అధికారిక అప్ డేట్​ను మాత్రం ఇంత వ‌ర‌కు మేక‌ర్స్ రిలీజ్ చేయ‌లేద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీని హారిక అండ్ హాసిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నుంద‌ట‌. అయితే చ‌ర‌ణ్ పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ దృష్టి అంతా ‘పెద్ది’పైనే ఉంది.