ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​IIT Kharagpur | ప్లేస్​మెంట్​లలో ఐఐటీ ఖరగ్​పూర్​ రికార్డు.. తొమ్మిది మందికి రూ.కోటి ప్యాకేజీ

    IIT Kharagpur | ప్లేస్​మెంట్​లలో ఐఐటీ ఖరగ్​పూర్​ రికార్డు.. తొమ్మిది మందికి రూ.కోటి ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IIT Kharagpur | ఐఐటీల్లో చదవాలని దేశంలోని ఎంతో మంది విద్యార్థులు(Students) కలలు కంటారు. ఐఐటీల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది. అందులో చదవిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ క్రమంలో లక్షలాది మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్​ పరీక్షలు(Entrance Exams) రాస్తారు. అయితే కొంతమంది మాత్రమే సీటు దక్కించుకుంటుంటారు. తాజాగా ఖరగ్​పూర్​ ఐఐటీ ప్లేస్​మెంట్​లలో రికార్డు సాధించింది.

    ఐఐటీ ఖరగ్​పూర్ విద్యార్థులు(IIT Kharagpur Students) ఏడాది 409 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లతో పాటు, 25 అంతర్జాతీయ సంస్థల్లో 1,800 ఉద్యోగాలను పొందారు. ఇందులో తొమ్మిది మంది విద్యార్థులు రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక వేతన ప్యాకేజీకి ఎంపికైనట్లు సంస్థ తెలిపింది. ఓ విద్యార్థి ఏకంగా రూ. 2.14 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నట్లు చెప్పింది. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంపై ఐఐటీ ఖరగ్​పూర్​ ఒక ప్రకటన విడుదల ఏసింది. ఇన్‌స్టిట్యూట్ శిక్షణ, ఆవిష్కరణ సంస్కృతి, విద్యార్థుల సామర్థ్యంపై విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనం అని సంస్థ పేర్కొంది.

    IIT Kharagpur | సవాళ్లలోనూ మెరుగైన ప్రతిభ

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ(AI) వినియోగం పెరుగుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా ఐఐటీ ఖరగ్​పూర్​ విద్యార్థులు 2024–25 ప్లేస్​మెంట్​ ప్రక్రియలో 1800 ఉద్యోగాలు సాధించడం గమనార్హం. మొత్తం 400 పైగా కంపెనీలు ప్లేస్​మెంట్​ డ్రైవ్​లో పాల్గొన్నట్లు IIT-ఖరగ్‌పూర్ డైరెక్టర్ అమిత్ పాత్ర తెలిపారు. సాఫ్ట్‌వేర్(Software), అనలిటిక్స్(Analytics), ఫైనాన్స్, బ్యాంకింగ్(Banking), కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్ రంగాల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఆయన వెల్లడించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...