- Advertisement -
HomeతెలంగాణMaoists | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో హైటెన్షన్‌

Maoists | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో హైటెన్షన్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | తెలంగాణ– ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో Telangana-Chhattisgarh border ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్ట karre guttaluను కేంద్ర బలగాలు central forces తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ గుట్టల్లో మావోయిస్టులు moaists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు మూడు రోజులుగా కూంబింగ్ coombing​ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌ Chhattisgarh, కేంద్ర బలగాలు ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ను search operation కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్‌ అడవులను జల్లెడపడుతున్నాయి. బీజాపూర్‌ bijapur జిల్లా పూజారి కాంకేడ్‌ మీదుగా చొచ్చుకెళ్తూ.. హిడ్మా hidmaను టార్గెట్‌ చేస్తూ భద్రత బలగాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌పై పట్టు కోల్పోతున్నారు. ఇప్పటికే వరుస ఎన్​కౌంటర్లతో బలహీనపడ్డ మావోయిస్టులు ఆ ఆపరేషన్​తో కుదేలు అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ ఆపరేషన్​తో రాష్ట్ర పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని మల్టీ జోన్​–1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి IG Chandra Shekar Reddy తెలిపారు. గురువారం పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రెగుట్ట ఆపరేషన్​లో కేంద్ర బలగాలే పాల్గొంటున్నాయని, దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వివరించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News