ePaper
More
    HomeజాతీయంBJP President | త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

    BJP President | త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP President | భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి కొద్ది వారాల్లో నూతన జాతీయ అధ్యక్షుడు రానున్నారు. జూలైలో లేదా ఆగస్టు మొదటి వారంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే జూలై 21న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ లోపు కొత్త అధ్యకుడి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతలోపు కాకపోతే ఆగస్టు మొదటి వారంలోనైనా నియామకం పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోంది.

    BJP President | రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు

    ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(BJP national president Nadda) 2020 జనవరి నుంచి పని చేస్తున్నారు. ఆయన పదవీ కాలం 2024లో ముగిసినా.. లోక్​సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో పొడిగించారు. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది అయినా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 21 తర్వాత 10 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం జాతీయ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.

    BJP President | సంస్థాగత ఎన్నికలు పూర్తి

    దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 14 రాష్టాలకు కొత్తగా అధ్యక్షులను నియమించింది. 18 నుంచి 19 రాష్ట్ర అధ్యక్షులు నియమితులైన తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), మధ్యప్రదేశ్(Madhya Pradesh), తెలంగాణ(Telangana) వంటి రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.

    BJP President | భారీ బాధ్యతలు..

    బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వారికి ముందు పరీక్ష కాలం ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అలాగే 2029 పార్లమెంట్​ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే సంవత్సరాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లగల, సంస్థాగత విషయాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడి కోసం పార్టీ అన్వేషిస్తోంది.

    BJP President | రేసులు పలువురు

    బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఒడిశాకు చెందిన ఓబీసీ నాయకుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​(Union Minister Dharmendra Pradhan)కు పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan) సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్​ బన్సల్​ సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు సమాచారం.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...