ePaper
More
    Homeబిజినెస్​Sacheerome | ‘సచీరోమ్‌’కు భారీ స్పందన.. తొలిరోజే 39 శాతం లాభాలకు అవకాశం..

    Sacheerome | ‘సచీరోమ్‌’కు భారీ స్పందన.. తొలిరోజే 39 శాతం లాభాలకు అవకాశం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Sacheerome | సచీరోమ్(Sacheerome) కంపెనీ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. ఐపీవో(IPO) సుమారు 313 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

    ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్ల తయారీలో గుర్తింపు పొందిన సచీరోమ్‌(Sacheerome) లిమిటెడ్‌ ఎస్‌ఎంఈ కంపెనీ.. స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ. 61.62 కోట్లు సమీకరించేందుకు ఐపీవో(IPO)కు వచ్చిన విషయం తెలిసిందే. ధరల శ్రేణి(Price band)ని కంపెనీ రూ. 96 నుంచి రూ. 102గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 1,200 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 1,22,400తో బిడ్లు దాఖలు చేశారు. ఈనెల 9 నుంచి 11 వరకు సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించారు. ఐపీవో మొత్తం 313 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ చూసింది. రిటైల్ కోటాలో 180 సార్లు, నాన్ ఇన్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కోటా 808 సార్లు, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల కేటగిరీ 172 సార్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. గురువారం రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌(Allotment Status) వెలువడే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 16న ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్టవుతాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్‌ ‍ప్రీమియం ఒక్కో షేరుకు రూ. 40గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి తొలిరోజే 39 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...