ePaper
More
    HomeసినిమాSinger Mangli | ఎలాంటి తప్పు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ

    Singer Mangli | ఎలాంటి తప్పు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Singer Mangli | టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ(Mangli Birthday Party) పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే.

    మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌(Tripura Resort)లో మంగ్లీ తన బర్త్‌డే సందర్భంగా ఓ పార్టీ ఇచ్చింది మంగ్లీ. అయితే ఆ పార్టీలో గంజాయి, డ్రగ్స్(Drugs) వినియోగం జరుగుతుందంటూ పోలీసులకి సమాచారం అంద‌డంతో రైడ్ చేశారు. ఇందులో భాగంగా దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ దొరికిపోయాడు. ఈ పార్టీలో బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య, నటుడు రచ్చ రవి, రైటర్ కాసర్ల శ్యామ్, సింగర్ ఇంద్రావతి సహా పలువురు సెలబ్రెటీలు కూడా ఉన్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీరు డ్ర‌గ్స్ తీసుకున్నారు అనే క‌థ‌నాలు రావ‌డంతో దీనిపై దివి రియాక్ట్ అయింది.

    Singer Mangli | వివ‌ర‌ణ ఇచ్చిన మంగ్లీ..

    “ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అని వెళ్తే అక్కడ ఏం జరుగుతున్నాయో లేక వాళ్లకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మనపైన తోయడం కరెక్ట్ కాదు కాదండీ.. మీరు కూడా ఒకసారి చూడండి.. చూసి నిజంగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నా లేక నేను ఏమైనా మిస్టేక్ చేశానని తెలిసుంటే అప్పుడు మీరు నా ఫొటో వేస్తే బాగుంటుంది.. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫొటో యూజ్ చేసి నెగిటివ్‌గా చేస్తే నా కెరీర్‌కి ఎంత ఇబ్బందండి. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో నాకే తెలుసు.. మీరు కూడా మీ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీ అని పిలిస్తే వెళ్తారు కదా.. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అని వెళ్లకుండా ఉండలేను కదా.. ఆ అమ్మాయి మంచిదని, నా ఫ్రెండ్ అని నేను వెళ్లాను.. అలా అక్కడ జరిగిన పరిస్థితులకి నేను బాధ్యురాలిలా నా ఫొటోని పెట్టి న్యూస్ రాయడం కరెక్ట్ కాదు. ద‌యచేసి నా ఫొటోలు వాడొద్దు..” అని దివి పేర్కొంది.

    ఇక మంగ్లీ ఎట్ట‌కేల‌కి ఈ వివాదంపై స్పందించింది. “నా బర్త్‌ డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్‌ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. లిక్కర్‌, సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా.. సడన్‌గా ప్లాన్‌ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునే దాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. రిసార్ట్‌లో లోకల్‌ లిక్కర్‌ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు లేవు, వాడ లేదు. పోలీసులు సెర్చ్‌ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరక లేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్‌ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో.. ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను. మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా..? మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు, ప్లీజ్‌”.. అని రిక్వెస్ట్ చేసింది మంగ్లీ.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...