AP Govt : నేడు సంబరాల సునామీ.. కూటమి ఏడాది పాలన సెలబ్రేషన్​
AP Govt : నేడు సంబరాల సునామీ.. కూటమి ఏడాది పాలన సెలబ్రేషన్​

అక్షరటుడే, అమరావతి: AP Govt : గతేడాది(2024) ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నిక(Andhra Pradesh Assembly elections)ల్లో చారిత్రక విజయం అందుకుని అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నేడు(జూన్ 12) రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు.

సాధారణ వార్షికోత్సవంగా కాకుండా.. జనం భాగస్వామ్యంతో, అభివృద్ధి ఆశయాలతో జనోత్సవంలా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం దాకా, కోస్తా నుంచి రాయలసీమ వరకు ఆ రోజు ప్రత్యేకతను ప్రతిబింబించేలా వేడుకలు జరిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమయ్యారు.

AP Govt : ప్రత్యేకత ఏమిటంటే..

కేవలం సభలు, ప్రసంగాలకు పరిమితం కాకుండా.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకను పెద్ద పండుగలా మలచాలని ఏపీ సర్కారు భావించింది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల కింద రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఒక గ్రామం, నియోజకవర్గం కాకుండా, మొత్తం రాష్ట్రానికే అభివృద్ధి సంకేతాలు ప్రసరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇతర పండుగలకంటే ఈ వేడుక భిన్నంగా ఉండాలని సర్కారు యోచించింది. సంక్రాంతి(Sankranti), ఉగాది(Ugadi), దసరా(Dussehra) లాంటి పండుగలు ప్రాంతాల వారీగా వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ, ఏపీ సర్కారు వేడుకను చేపట్టిన ఈరోజు మాత్రం ప్రతీ మూలకు అభివృద్ధి రేఖలు గీయనున్న దినోత్సవం. ప్రజల చైతన్యం, పాలకుల నిబద్ధత, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం ఈ వేడుకను ప్రత్యేకంగా నిలపనున్నాయని భావిస్తున్నారు.

ఏడాది పాలనలో రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం. దాదాపు 8.5 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనను ఏపీ సర్కారు తన సామర్థ్యంగా ప్రదర్శించబోతోంది. పాలన అంటే అభివృద్ధి అని ప్రజలకు గుర్తు ప్రయత్నంగా ఈ సంబరాలు ఉండబోతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అమరావతి(Amaravati)లో ప్రధాని(Prime Minister) సభ జరిగిన ప్రాంతంలోనే వేడుక నిర్వహించే యోచన చేస్తోంది సర్కారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం చంద్రబాబు(Chief Minister Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు.