అక్షరటుడే, ఇందూరు:District Judge | జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జీవీఎన్ భరతలక్ష్మి(GVN Bharathalakshmi)ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.