Stock Market | యుద్ధ భయంతో స్టాక్‌ మార్కెట్లు ఢమాల్‌
Stock Market | యుద్ధ భయంతో స్టాక్‌ మార్కెట్లు ఢమాల్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధ భయాలతో స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి(Selling pressure)ని ఎదుర్కొంటున్నాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఊచకోతకు గురవుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నా.. మన మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవి చూస్తున్నాయి.

అంతర్జాతీయంగా సానుకూల అంశాలు నెలకొంటుండడంతో శుక్రవారం ఉదయం మన మార్కెట్లు indian stock markets కూడా పాజిటివ్‌గానే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే సెల్లాఫ్‌కు గురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Terror attack) నేపథ్యం అనంతరం జరుగుతున్న పరిణామాలతో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలున్నాయన్న భయంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుక్‌(Profit booking) చేసుకుని క్యాష్‌తో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మన స్టాక్స్‌ భారీగా పతనమవుతున్నాయి. ఐటీ సెక్టార్‌ మాత్రమే పాజిటివ్‌గా ఉండగా.. మిగతా రంగాలన్నీ భారీ నష్టాలతో ట్రేడ్‌(Trade) అవుతున్నాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ సుమారు రూ. 7 లక్షల కోట్లకుపైగా ఆవిరయ్యింది.

Stock Market | లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి..

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 29 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 329 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో అక్కడినుంచి 1,406 పాయింట్లు పడిపోయింది. 43 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌(Trading) ప్రారంభించిన నిఫ్టీ.. ఇంట్రాడేలో గరిష్టంగా 119 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి ఒక్కసారిగా 476 పాయింట్లు నష్టపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 986 పాయింట్ల నష్టంతో 78,815 వద్ద, నిఫ్టీ(Nifty) 330 పాయింట్ల నష్టంతో 23,916 వద్ద ఉన్నాయి.
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 464 మాత్రమే పాజిటివ్‌గా ఉండగా.. 3,382 నష్టాలతో కొనసాగుతున్నాయి. మరో 131 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి.

Gainers..

బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 4 కంపెనీలు మాత్రమే లాభాలతో ఉండగా 26 కంపెనీలు నష్టాలతో కదలాడుతున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌(TCS), ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా మాత్రమే లాభాలతో కొనసాగుతున్నాయి.

Top Losers..

యాక్సిస్‌ బ్యాంక్‌ 4.8 శాతం, అదాని పోర్ట్స్‌(Adani ports) 4.1 శాతం పడిపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌ గ్రిడ్‌, ఎటర్నల్‌(జొమాటో) మూడు శాతానికిపైగా నష్టంతో ఉండగా.. ఎన్టీపీసీ(NTPC), బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌ రెండు శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.