ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | వరదల కట్టడికి హైడ్రా కీలక నిర్ణయం.. రంగంలోకి మాన్సూన్ టీమ్స్

    Hydraa | వరదల కట్టడికి హైడ్రా కీలక నిర్ణయం.. రంగంలోకి మాన్సూన్ టీమ్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్​ (Hyderabad) నగరవాసులు నిత్యం భయంభయంగా బతుకుతారు. నగరంలోని చాలా ప్రాంతాలను వరద నీరు(Floods) ముంచెత్తుతుంది. అంతేగాకుండా రోడ్లపై నీరు చేరి చెరువులను తలపిస్తాయి. దీంతో చిన్న వాన పడ్డా ప్రజలు ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్​లో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్​లో వరదల నియంత్రణకు హైడ్రా(Hydraa) అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సికింద్రాబాద్​లో నాలాల ఆక్రమణలను తొలగించిన అధికారులు.. తాజాగా మాన్సూన్​ టీమ్స్(Mansoon Teams)​ను రంగంలోకి దింపాలని నిర్ణయించింది.

    Hydraa | 130 బృందాలు

    వర్షాకాలంలో నగరాన్ని వరద ముంచెత్తకుండా హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 130 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్​ను సమాయత్తం చేస్తోంది. ఒక్కో టీంలో 12 మంది ఉంటారు. ఈ ఎమర్జెన్సీ బృందాలకు హైడ్రాకు చెందిన 51 DRF బృందాలు కూడా తోడవుతున్నాయి. ఒక్కో DRF బృందంలో 15 మంది చొప్పున ఉంటారు. ఈ రెండు బృందాలు సమన్వయంతో పనిచేసేలా హైడ్రా అధికారులు దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడ నీరు నిలుస్తోందో అక్కడ ఈ బృందాలు పనిచేస్తాయి. వరద ముప్పును తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అలాగే నివాసప్రాంతాల్లో వరద నిలవకుండా చూస్తుంది.

    Hydraa | పూడికతీసే పని జీహెచ్​ఎంసీ పరిధిలోనే..

    వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతలను హైడ్రాకు అప్పగించిన విషయం విదితమే. ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ పరిధిలో ఉండే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల విధుల పర్యవేక్షణ హైడ్రా పరిధిలోకి వచ్చింది. మురుగు కాల్వల్లో చెత్త, పూడిక తీసే పనులు మాత్రం GHMC పరిధిలోనే కొనసాగుతాయి. ఎక్కడయినా అవసరం ఉన్నా చోట జీహెచ్​ఎంసీకి హైడ్రా సహకారం అందిస్తుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...