అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీం(SOT) సభ్యులు కలిసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్(Hash oil) స్వాధీనం చేసుకున్నారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాకు చెందిన పాంగి కేశవరావు (40), ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన జయరామ్ ఖేముండు (26) అంబర్‌పేట్‌లో హాష్ ఆయిల్(Hash oil) విక్రయించడానికి వచ్చారన్నారు. బెంగళూరుకు చెందిన వారికి దీనిని డెలివరీ ఇవ్వడానికి వేచి చూస్తుండగా తాము పట్టుకున్నట్లు తెలిపారు.
Hyderabad | సులభంగా డబ్బు సంపాదించాలని..
నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలని ఈ దందాలోకి దిగినట్లు సీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని గిరిజన ప్రాంతాల నుంచి వీరు హాష్ ఆయిల్ కొనుగోలు చేసి, హైదరాబాద్ మీదుగా బెంగళూరు (Bengaluru)కు రవాణా చేస్తున్నారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి బెంగళూరులో దాదాపు పది రెట్ల ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. కేశవరావు బాల్య స్నేహితుడైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండల నివాసి అయిన కృష్ణ వీరికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నాడు. కృష్ణనే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి కేశవరావును ఈ దందాలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కృష్ణ పరారీలో ఉన్నాడు.