ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Pre Primary Schools | తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.. ఇక సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ

    Pre Primary Schools | తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.. ఇక సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pre Primary Schools | చిన్నారుల తల్లిదండ్రులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక నుంచి ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ పైమరీ విద్య(pre primary education)ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠాలు బోధిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్​వాడీ కేంద్రాలకు(Anganwadi centers) పంపుతున్నారు. అయితే ప్రైవేట్​ పాఠశాలల్లో నర్సరీ, ఎల్​కేజీ, యూకేజీ పేరిట ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రైవేట్​ బడులకు పంపుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    Pre Primary Schools | ఈ విద్యా సంవత్సరం నుంచే..

    ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు తెలంగాణ సర్కారు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 210 స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి ఇస్తూ విద్యాశాఖ (Education Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా బడుల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

    Pre Primary Schools | మరి అంగన్​వాడీలు..?

    రాష్ట్రంలో ప్రస్తుతం మూడేళ్లు నిండిన చిన్నారులను అంగన్​వాడీ కేంద్రాల్లో చేర్చుకుంటున్నారు. కేంద్రాల ద్వారా చిన్నారులకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు. అంతేగాకుండా చిన్నారులకు కేంద్రాల్లో ఆటలు ఆడిస్తూ చదువు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశ పెట్టడంతో అంగన్​వాడీ కేంద్రాల పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

    మూడేళ్లు నిండిన పిల్లలను తల్లిదండ్రులు నర్సరీలో జాయిన్​ చేస్తారు. ఇలా అయితే అంగన్​వాడీ కేంద్రాలకు వెళ్లే వారు ఉండరు. అంగన్​వాడీ కేంద్రాలను ఆయా పాఠశాలకు అనుసంధానం చేస్తారా.. లేక విలీనం చేసి కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

    Latest articles

    Union Minister Bandi Sanjay | వరద బాధితులకు అండగా ఉంటాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

    అక్షరటుడే, కామారెడ్డి : Union Minister Bandi Sanjay : ఎల్లారెడ్డి Yellareddy నియోజకవర్గంలో వరద బాధితులకు అండగా...

    Heavy rain burust | కామారెడ్డికి రెడ్​ అలెర్ట్​.. ఇప్పటికే జిల్లా అతలాకుతలం

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains burust | రాష్ట్రానికి వానగండం పట్టుకుంది. ముఖ్యంగా కామారెడ్డి, ఉమ్మడి మెదక్​ జిల్లాలపై...

    Kamareddy | తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన వాహనాలు.. కామారెడ్డి జిల్లాలో ఆందోళనకర పరిస్థితి..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం తీవ్ర ఆందోళనకర పరిస్థితి సృష్టించింది. జిల్లా చరిత్రలోనే...

    Yellareddy | ఎల్లారెడ్డిలో వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్​ సమీక్ష

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్​ (Medak), కామారెడ్డిలో (Kamareddy)...

    More like this