అక్షరటుడే, ఇందూరు : Blood donation | రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో బుధవారం నగరంలోని రెడ్ క్రాస్(Red Cross)లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది క్లబ్ సభ్యులు, యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి, ఆరోగ్య వంతులైన వారు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ బుస ఆంజనేయులు, కార్యదర్శి అరుణ్ బాబు, కోశాధికారి కరిపె రవీందర్, లయన్స్ క్లబ్ అద్యక్షుడు లింబాద్రి, జిల్లా అదనపు కార్యదర్శి పి.లక్ష్మీనారాయణ, కోశాధికారి పి.రాఘవేందర్, పీఆర్వో చింతల గంగాదాస్, డైరెక్టర్ సత్యనారాయణ, ప్రోగ్రాం ఛైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు.
