ePaper
More
    Homeటెక్నాలజీElon Musk | వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మ‌స్క్ యాప్.. మ‌రి కొద్ది రోజుల‌లోనే లాంచ్

    Elon Musk | వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మ‌స్క్ యాప్.. మ‌రి కొద్ది రోజుల‌లోనే లాంచ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Elon Musk | ఎలాన్‌ మస్క్ ఇటీవ‌లి కాలంలో ఆయన ఏం చేసినా అదో సంచలనం. ఇప్పుడు ఆయ‌న వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), టెలిగ్రామ్‌ వంటి యాప్‌లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకురాబోతున్నాడు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్​కు పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ చాట్(XChat)ను తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు. ఈ యాప్‌ సెక్యూర్‌, వెర్సటైల్‌ ఫీచర్ల(Versatile features)తో ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎక్స్‌ చాట్‌ తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తామని ఛాలెంజ్‌ చేస్తున్నాడు.

    Elon Musk | బెస్ట్ ఆప్ష‌న్స్..

    ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్‌డేటెడ్‌ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌(Beta testing)లో ఉన్న ఈ ఎక్స్ చాట్ త్వరలో పెయిడ్ చందాదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్‌‌కు పోటీగా ఎక్స్ యాప్(X App) ఇప్పుడు ఎక్స్ చాట్‌(XChat)ను పరిచయం చేయ‌నున్నార‌ట‌. ఇందులో వాట్సాప్ కంటే మెరుగైన సేవలను అందిస్తామ‌ని అంటున్నారు. సెట్‌ టైమ్‌ తర్వాత మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిసప్పియర్‌ అయిపోతాయి. ఏ టైప్‌ ఫైల్స్‌ అయినా షేర్‌ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడవచ్చు. ఈ ఆప్షన్లతో (XChat), వాట్సాప్‌కు బలమైన పోటీ ఇవ్వనుంది.

    కొంతమంది ‘X’ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు ఇప్పటికే ఎర్లీ వెర్షన్‌ని టెస్ట్‌(early version) చేస్తున్నారు. లాంచింగ్‌ ముందే యాప్‌ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎక్స్ చాట్‌లో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్(Encrypted messaging), ఫైల్ షేరింగ్(File sharing), వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా ఎక్స్‌ను అభివృద్ధి చేయాలన్నదే మస్క్ ఆలోచనగా కనబడుతోంది. ప్రైవసీ, ఫైల్-షేరింగ్, సోషల్ మీడియా(Social media) ఇంటిగ్రేషన్ వంటివి ఆల్-ఇన్-వన్ యాప్ కోసం చూస్తున్న వినియోగ‌దారుల‌ను ఎక్స్ చాట్ ఆక‌ర్షించే అవ‌కాశం ఉంది. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

    Latest articles

    Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​లో పలువురికి జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్​...

    Guvvala Balaraju | ప్రతిపక్ష పాత్రలో బీఆర్‌ ఎస్‌ విఫలం.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Guvvala Balaraju | నాగర్‌ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former Nagarkurnool MLA...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఈ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ప్రజలను పట్టి పీడిస్తున్నారు....

    More like this