ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTPCC | సమష్టిగా కాంగ్రెస్​ను ముందుకు తీసుకెళ్తాం..

    TPCC | సమష్టిగా కాంగ్రెస్​ను ముందుకు తీసుకెళ్తాం..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: TPCC | పార్టీ బలోపేతం దిశగా అందరిని కలుపుకుని సమష్టిగా ముందుకు వెళ్తామని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవిని న్యాయం చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన మొదటి వ్యక్తిని తానేనని తెలిపారు. ఎన్నికల అనంతరం మున్సిపల్ ఛైర్మన్​గా, ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా పార్టీ తనకు సముచిత స్థానం ఇచ్చిందన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ లైన్ దాటి పోయేది లేదని స్పష్టం చేశారు. తనకు టీపీసీసీ సెక్రెటరీగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...