ePaper
More
    Homeక్రైంSp Rajesh Chandra | వివాహేతర సంబంధమే జీపీ కార్యదర్శి హత్యకు కారణం

    Sp Rajesh Chandra | వివాహేతర సంబంధమే జీపీ కార్యదర్శి హత్యకు కారణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | వివాహేతర సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్నకొడప్​గల్(Chinna Godapgal)​ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్యకు వివాహమైంది. మల్కయ్య బతుకు దెరువు కోసం నాలుగునెలలు హైదరాబాద్​కు (Hyderabad) వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అయితే తన భార్యతో పంచాయతీ కార్యదర్శి దారావత్​ కృష్ణకు (Panchayat Secretary Darawat Krishna) వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని తెలుసుకున్న మల్కయ్య నిత్యం భార్యతో గొడవపడేవాడు.

    అనంతరం కృష్ణను ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో తన భార్యతో ఈనెల 5న కృష్ణకు ఫోన్​ చేయించి ఇంటికి రప్పించారు. అక్కడ మరో ఇద్దరు ఎర్రన్నోళ్ల బాలరాజు, లింగంపేట మల్యయ్యతో కలిసి కృష్ణను గొడ్డలి, కత్తి, ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పడేశారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించామని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులు, రెండు బైక్​లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి, బాన్సువాడ రూరల్​ సీఐ రాజేశ్​, ఎస్సై రాజు, సిబ్బంది ఎస్పీ అభినందించారు.

    More like this

    Vote Chori | ప్ర‌ధానిపై కాంగ్రెస్ ఏఐ వీడియో.. అన్ని హ‌ద్దులు దాటింద‌ని బీజేపీ విమ‌ర్శ‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయ‌న మాతృమూర్తిని కించ‌ప‌రిచిన వివాదం చెలరేగిన...

    Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్ (Nizam Sagar)​కు ఎగువ నుంచి భారీగా వరద...

    Asia Cup | పోరాడే ల‌క్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచిన హాంకాంగ్.. అయిన‌ప్ప‌టికీ..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ విజయవంతమైన ఆరంభాన్ని నమోదు చేసుకుంది....