ePaper
More
    HomeసినిమాPawan Kalyan | ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెట్‌లో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తుపాను వ‌చ్చేసింది...

    Pawan Kalyan | ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెట్‌లో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తుపాను వ‌చ్చేసింది అంటూ ట్వీట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Pawan Kalyan | హైదరాబాద్ Hydeabad శివార్లలో ఒక భారీ సెటప్. . కెమెరాలు, క్రేన్‌లు, లైట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సిబ్బందిలో సందడి, నటీనటుల ముఖాల్లో ఆసక్తి. అంద‌రి మొహాల్లోనూ ఒకే ఒక ప్రశ్న.. “ఈరోజు పవన్ గారు వస్తారట కదా?” అని. టెక్నీషియ‌న్స్ కూడా సెట్లో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నిమిషాల తర్వాత… నెమ్మదిగా గేట్ ఓపెన్ అయింది. ఒక కాస్ట్‌లీ కారు నెమ్మ‌దిగా లోపలికి వ‌చ్చింది. కారులోనుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) గారు బయటకు వచ్చారు. ఇంకేముంది అంద‌రిలో ఆనందం. సెట్ అంతా క‌ళ‌క‌ళ‌లాడింది. నిర్మాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి గ్రాండ్ వెల్‌క‌మ్ ఇచ్చారు.

    Pawan Kalyan | ఆంధీ వ‌చ్చేశాడు..

    ఇక సెట్‌లోకి అడుగుపెట్ట‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan ఏపీ డిప్యూటీ సీఎం అని మ‌రిచిపోయి న‌టుడిగా త‌న డ్యూటీ చేశారు. హరీష్ శంక‌ర్(Harish Shankar),శ్రీలీల‌(Srilila), ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌దాగా మాట్లాడుకుంటున్న కొన్ని సన్నివేశాల‌ని కూడా వీడియోలో చూపించారు. మొదట హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చి ఆ సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసేశారు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమాకు కూడా రెండు వారాల డేట్స్ ఇచ్చి త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసాడు. రెండు రోజుల క్రితమే OG షూటింగ్ పూర్తిచేసాడు. అలా రెండు సినిమాల షూటింగ్స్ నెల రోజుల గ్యాప్ లో పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) లోకి అడుగు పెట్టాడు.

    ఇక ఈ సినిమాని కూడా శ‌ర‌వేగంగా పూర్తి చేయ‌నున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా ఒక ఫుల్ లెంగ్త్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధం అయ్యింది. ఈ షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్, గతంలో గబ్బర్ సింగ్‌తో చూపించిన మేజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. గతంలో తేరి theri సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసారు. కానీ తేరి ఆల్రెడీ హిందీలో రీమేక్ అయి ఫ్లాప్ అవ్వడం, పొలిటికల్ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు కథ మొత్తం మార్చేసి కొత్త కథతో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...