ePaper
More
    Homeబిజినెస్​Stock Market | దూసుకుపోతున్న భారత్‌ స్టాక్‌ మార్కెట్‌.. మూడు నెలల్లో ట్రిలియన్‌ డాలర్లు పెరిగిన...

    Stock Market | దూసుకుపోతున్న భారత్‌ స్టాక్‌ మార్కెట్‌.. మూడు నెలల్లో ట్రిలియన్‌ డాలర్లు పెరిగిన సంపద

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | భారత స్టాక్‌ మార్కెట్‌(Bharath stock market) దూసుకువెళ్తోంది. గతేడాది ఎదురైన అమ్మకాల ఒత్తిడిని అధిగమించి పరుగులు తీస్తోంది. గత మూడు నెలల్లో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌(Market cap) పెరిగిన దేశంగా రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి భారత్‌ మార్కెట్‌ విలువ ఒక ట్రిలియన్‌(Trillion) డాలర్లు పెరిగింది. మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో పెరుగుదల 20 శాతంగా నమోదయ్యింది. టాప్‌ 10 మార్కెట్లలో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం.

    గతేడాది(Last year) మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల(Loksabha)లో బీజేపీకి సంపూర్ణ ఆధిక్యం లభించకపోవడంతో మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాముల ప్రభావం పెరిగి వృద్ధి మందగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక మాంద్యం, జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions) మార్కెట్లను కలవరపెట్టాయి. కంపెనీల వాల్యూయేషన్‌ ఎక్కువగా ఉండడం, చైనాతోపాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు ఆకర్షణీయ లాభాలను ఇచ్చే అవకాశాలు ఉండడంతో ఎఫ్‌ఐఐ(FII)లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించారు.

    అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఎంపికయ్యాక వివిధ దేశాలతో వాణిజ్యం విషయంలో వ్యవహరించిన తీరు మరింత అస్థిరతకు దారితీసింది. దీంతో మన ప్రధాన సూచీలు(Benchmark indices) 20 శాతం వరకు క్షీణించాయి. చాలా స్టాక్స్‌ అంతకన్నా ఎక్కువగా పడిపోయాయి. కొన్ని స్టాక్స్‌ 80 శాతం కూడా పతనమయ్యాయి. డీఐఐలతోపాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు అండగా నిలిచి మన మార్కెట్లలో భారీ పతనాన్ని అడ్డుకున్నారు.

    Stock Market | మార్చినుంచి మళ్లీ పరుగులు..

    ఈ ఏడాది మార్చి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం(Central government) స్థిరంగా కొనసాగడం, బలమైన నాయకత్వం కారణంగా మన మార్కెట్లపై ఫారిన్‌ ఇన్వెస్టర్లకు నమ్మకం ఏర్పడిరది. ఇతర దేశాలకన్నా మన మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపించడంతో ఇక్కడికి తిరిగి పెట్టుబడులను తరలించడం మొదలుపెట్టారు. దీంతో ప్రధాన సూచీలలో పెరుగుదల ప్రారంభమైంది. మూడునెలల కాలంలో భారత బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌(Sensex) 12.5 శాతం, నిఫ్టీ 13.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 26 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 20.7 శాతం పెరిగాయి. మూడు నెలల్లోనే మన మార్కెట్‌ క్యాప్‌ ఒక ట్రిలియన్‌ డాలర్లు పెరగడం గమనార్హం. దీంతో మన మార్కెట్‌ క్యాపిటల్‌ 5.33 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ ఉంది. తొలి నాలుగు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌, హాంగ్‌కాంగ్‌ ఉన్నాయి.

    Stock Market | టాప్‌ టెన్‌లో చిట్టచివరన చైనా..

    మార్చి తర్వాత భారత మార్కెట్లు వేగంగా పుంజుకోగా.. చైనా(China), అమెరికా వంటి మార్కెట్లు తక్కువ వృద్ధిని నమోదు చేశాయి. 20 శాతం మార్కెట్‌ క్యాప్‌ వృద్ధితో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో జర్మనీ(Germany) నిలిచింది.ఆ దేశ మార్కెట్‌ క్యాప్‌ సుమారు 13.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 10.8 శాతం పెరుగుదలతో కెనడా మూడో స్థానంలో, 9 శాతం వృద్ధితో హాంగ్‌కాంగ్‌ నాలుగో స్థానంలో, 7.5 శాతం పెరుగుదలతో యూకే ఐదో స్థానంలో, 7.3 శాతం పెరుగుదలతో జపాన్‌ ఆరోస్థానంలో ఉన్నాయి. తైవాన్‌ 5.2 శాతంతో తైవాన్‌ ఏడో స్థానంలో, 3.8 శాతం వృద్ధితో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌ అయిన యూఎస్‌ మార్కెట్‌ విలువ 2.5 శాతం మాత్రమే పెరిగింది. చైనా మార్కెట్‌ క్యాప్‌ వృద్ధి 1.9 శాతంగా నమోదై టాప్‌ టెన్‌లో చిట్టచివరన ఉంది.

    Latest articles

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను...

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...

    KTR | అలా చేసినట్లు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్...

    More like this

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను...

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...