ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | కొత్త మంత్రులకు శాఖలపై సీఎం కీలక వ్యాఖ్యలు

    CM Revanth Reddy | కొత్త మంత్రులకు శాఖలపై సీఎం కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) సందర్భంగా ముగ్గురికి కొత్తగా అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. వాకిటి శ్రీహరి (Vakiti Srihari), గడ్డం వివేక్​ (Gaddam Vivek), అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ (Adluri Laxman Kumar) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు.

    CM Revanth Reddy | హైదరాబాద్​ వెళ్లగానే శాఖలు కేటాయిస్తా

    మంత్రుల శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గ కూర్పు కోసం చర్చించడానికి సీఎం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ (Delhi) పర్యటన ముగించుకొని ఆయన మధ్యాహ్నం 12:30 హైదరాబాద్​ (Hyderabad) బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్​ రాగానే కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తానని వెల్లడించారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త వారికి ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో 11 శాఖలు ఉన్నాయి. ఇందులో నుంచి పలు శాఖలను కొత్త వారికి కేటాయించనున్నారు. దీంతో పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.

    CM Revanth Reddy | కేసీఆర్​ కుటుంబానికి నో ఎంట్రి

    సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వచ్చింది తెలంగాణ (Telangana), కర్ణాటకలో (Karnataka) విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికి అన్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలోకి (Congress party) నో ఎంట్రీ అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కవిత కాంగ్రెస్​లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని సీఎం అన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...