ePaper
More
    HomeతెలంగాణLiquor Seized | భారీగా మద్యం పట్టివేత

    Liquor Seized | భారీగా మద్యం పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Liquor Seized | అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్​ పోలీసులు(Excise Police) పట్టుకున్నారు. జూన్ 3 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఎక్సైజ్​ అధికారులు ప్రత్యేక డ్రైవ్​ చేపట్టారు. ఇందులో భాగంగా రూ.25 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
    రాష్ట్ర టాస్క్ ఫోర్స్(STF), జిల్లా టాస్క్ ఫోర్స్(DTF) స్థానిక ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో మొత్తం 64 కేసులు నమోదు చేసి, 33 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

    Liquor Seized | నాన్​ డ్యూటీ పెయిడ్​ లిక్కర్​

    ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా ట్యాక్స్ చెల్లించుకుండా తీసుకొచ్చిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 22 లీటర్ల బీరు, 21 లీటర్ల దేశీయ మద్యంతో సహా 1,188 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాకు ఉపయోగించిన 19 వాహనాలను సైతం సీజ్ చేశారు. ఎక్కువగా శంషాబాద్, సరూర్‌నగర్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...