ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | కేసీఆర్​ వెంట సంతోష్​రావు.. దూరంగా కవిత

    MLC Kavitha | కేసీఆర్​ వెంట సంతోష్​రావు.. దూరంగా కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన అనంతరం తొలిసారి బుధవారం ఫామ్​హౌస్(Farmhouse)​కు వెళ్లారు. కేసీఆర్​ కాళేశ్వరం విచారణకు వెళ్లనున్న సందర్భంగా ఆమె ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫామ్​ హౌస్​కు వెళ్లి ఆమె తన తండ్రిని కలిశారు.

    బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party)కి కొంతకాలంగా దూరంగా ఉంటున్న కవిత.. ఇటీవల జాగృతిపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. పార్టీలో కొందరు దెయ్యాలు ఉన్నారంటూ ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి తనను దూరం చేస్తున్నారని కేటీఆర్​(KTR), సంతోష్​రావు(Santosh Rao)ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు.

    ఈ క్రమంలో బుధవారం కేసీఆర్​ ఫామ్​హౌస్​లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్​ వెంట సంతోష్​రావు లిఫ్ట్​లో కిందకు రాగా.. కవిత మాత్రం మెట్లపై నుంచి నడుచుకుంటూ వచ్చారు. అనంతరం కూడా ఆమె అక్కడి నాయకులతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరించారు. బీఆర్​ఎస్​ నాయకులు(BRS Leaders) కేసీఆర్​ దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా కవిత(MLC Kavitha) దూరంగా నిలబడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...