ePaper
More
    HomeసినిమాAllu Arjun | హైఓల్టేజ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ సినిమా.. దిల్​రాజు ప్ర‌య‌త్నాలు

    Allu Arjun | హైఓల్టేజ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ సినిమా.. దిల్​రాజు ప్ర‌య‌త్నాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | సినీ ఇండ‌స్ట్రీలో క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రూపొంద‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ (Salar) సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫేవరెట్ డైరెక్టర్ అయ్యారు ప్రశాంత్ నీల్. ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ వరకు.. హీరోలు అందరూ రెడీ. అయితే అతని దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా నిర్మించేందుకు ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ‘కేజీఎఫ్’ (KGF) వంటి సంచలన హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ స్టైల్‌కు కొత్త లెవెల్ వచ్చేసింది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’తో (Pushpa 2) దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

    READ ALSO  War 2 Song | వార్ 2 నుండి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్.. కియారా కేక పెట్టించేసిందిగా..!

    Allu Arjun | నిజమెంత‌?

    ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తే వేరే లెవ‌ల్‌లో ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఈ కాంబో కోసం దిల్ రాజు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు (Dil Raju) నిర్మించిన ‘గేమ్ చేంజర్’ (Gamr Changer) ఆశించిన విజయం సాధించలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.‌ దాంతో మరో భారీ సినిమా చేసి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ‘దిల్’ రాజు ట్రై చేస్తున్నారు. ఆయనకు ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ (Allu Arjun) ప్రామిస్ చేశారట.

    READ ALSO  OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే...!

    అల్లు అర్జున్ ప్రామిస్ చేయడంతో ఆయనకు సరిపడా డైరెక్టర్ వేటలో దిల్ రాజు పడ్డారు. గతంలో ఆయనకు ఒక సినిమా చేస్తానని ప్రశాంత్ నీల్ ప్రామిస్ చేశారట. అయితే అడ్వాన్స్ వంటిది ఏమీ దిల్ రాజు ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ తీసుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రశాంత్ నీల్(Prashant neel) సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో (Prashant neel Direction) సినిమా అయితే నేషనల్ వైడ్ క్రేజ్ ఉంటుందని ఆ కాంబినేషన్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ‘దిల్’ రాజు. త్వరలో హీరో, దర్శకుడు మధ్య ఒక మీటింగ్ అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బ‌న్నీ ఆ తర్వాత‌నే ప్ర‌శాంత్ నీల్‌తో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.

    READ ALSO  Hari Hara Veeramallu | ప‌వ‌న్ పెట్టుకున్న మాస్క్‌ని తన ముక్కుకి పెట్టుకొని సంతోషంగా ఫీలైన న‌టి.. ఆయ‌న ఎంగిలి అంటే ప్రాణమ‌ట‌

    Latest articles

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...

    More like this

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...