ePaper
More
    HomeసినిమాKota Srinivasa rao | ఏంటి.. కోట శ్రీనివాస‌రావు ఇలా అయిపోయారు.. కాలికి క‌ట్టుతో, స‌న్న‌గా..!

    Kota Srinivasa rao | ఏంటి.. కోట శ్రీనివాస‌రావు ఇలా అయిపోయారు.. కాలికి క‌ట్టుతో, స‌న్న‌గా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kota Srinivasa rao | టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో రావు గోపాల రావు తర్వాత తెలుగు విలనిజానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు కోట శ్రీనివాసరావు. నటుడిగా(Actor) ఏడు వందల పైచిలుకు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో న‌టించిన కోట(Kota Srinivasa rao) కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట 1947, జులై 10న జన్మించారు. బాల్యం నుంచి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం ఇలా ప‌లు భాష‌ల‌లో న‌టించి మెప్పించాడు కోట‌. నటుడిగానే కాకుండా, 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra pradesh) విజయవాడ తూర్పు (Vijayawada East) నుండి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు.

    Kota Srinivasa rao | ఇలా అయిపోయారు..

    నటనపై ఉన్న ప్రేమతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి(film industry) వచ్చారు. ఆయన ప్రదర్శించిన తెలంగాణ యాస ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆయన నటన, సంభాషణలు, హావభావాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. విలన్​గా భయపెట్టాలన్నా.. కామెడీ(Comedy)తో నవ్వించాలన్నా.. ఎమోషన్స్​తో ఏడిపించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa rao). వ‌యోభారం వ‌ల‌న ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. వయో వృద్ధాప్య సమస్యలతో ఆయన పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

    READ ALSO  Mahavatar Narsimha | చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రం.. బాక్సాఫీస్‌ దుమ్ములేపుతున్న ‘మహావతార్ నరసింహ’

    అయితే కోట‌ని తాజాగా ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేశ్​ క‌లిశారు. ఆయ‌న‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను బండ్ల త‌న సోష‌ల్ మీడియాలో(Social media) షేర్ చేశారు. ఇవి ఆందోళ‌న క‌లిగించాయి. బండ్ల గణేష్(Bandla Ganesh) “కోట బాబాయ్​ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అంటూ ఆ ఫొటోలను పంచుకున్నప్పటికీ, ఆ చిత్రాలలో కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి ఆయన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన ఎడమ కాలికి తీవ్రమైన గాయం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కోట శ్రీనివాసరావు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చాలా స‌న్న‌గా గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా కోట మారారు. ఆయ‌న ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కోట త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్థిస్తున్నారు.

    Latest articles

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...

    BJP | ఈసీ మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయ్.. రాహుల్ గాంధీకి బీజేపీ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | ఎన్నికల సంఘంపై ప్రత్యక్ష దాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...

    Tollywood | కార్మికుల వేతనాల పెంపునకు నిర్మాతల ఓకే.. కండీషన్లకు ఒప్పుకునేది లేదన్న ఫెడరేషన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tollywood | తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో కొన్ని రోజులుగా నెలకొన్న కార్మికుల వేతనం...

    Railway Passengers | ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. రిటర్న్ జర్నీ టికెట్​పై 20 శాతం తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని...

    More like this