ePaper
More
    Homeక్రీడలుTerror Attack | భారత్ Vs పాక్ మ్యాచ్‌లపై బీసీసీఐ సంచలన నిర్ణయం!

    Terror Attack | భారత్ Vs పాక్ మ్యాచ్‌లపై బీసీసీఐ సంచలన నిర్ణయం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఇండియా, పాక్​ మధ్య క్రికెట్​ మ్యాచ్​ అంటే అభిమానులు ఎంతో ఉత్కంఠతో చూసేవారు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్​, పాక్​ తలపడుతున్నాయి. ఇక అలాంటి మ్యాచ్​లు ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌ Jammu Kashmirలోని పహల్గామ్‌ pahalgamలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాయాదీ పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ cricket మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు Bilateral series జరగడం లేదు. కేవలం ఐసీసీ ICC, ఏసీసీ ACC టోర్నీల్లో మాత్రమే దాయాదీ దేశాలు తలపడుతున్నాయి.

    ఇక నుంచి ఆ మ్యాచ్‌లు కూడా ఆడవద్దని బీసీసీఐ BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ ICCకి లేఖ రాసినట్లు కూడా ప్రముఖ క్రికెట్ వె‌బ్‌సైట్స్ పేర్కొన్నాయి. గత మంగళవారం(ఏప్రిల్ 22) జరిగిన ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ దేశం భగ్గుమంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధిస్తూ పరోక్ష యుద్దానికి తెరలేపింది. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా ఆ దేశానికి గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL)కు సంబంధించిన భారత ప్రసారాలను బ్రాడ్‌కాస్టర్స్‌ నిలిపివేశాయి.

    ‘పహల్గామ్‌ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలో భారత్ bharat, పాకిస్థాన్‌ pakistanలను ఒకే గ్రూపులో ఉంచవద్దని కోరుతూ బీసీసీఐ.. ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ ఈవెంట్స్‌లో కూడా పాక్‌తో ఆడవవద్దని బీసీసీఐ భావిస్తోంది.’అని క్రిక్‌బజ్ తమ నివేదికలో పేర్కొంది. బీసీసీఐ డిమాండ్ ను ఐసీసీ అంగీకరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు PCB ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లనుంది. పీసీబీతో పాటు బ్రాడ్‌కాస్టర్స్ కూడా తీవ్రంగా నష్టపోనున్నాయి. ఈ ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ womenrs oneday world cup జరగనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్ తలపడాల్సి ఉంది. మరీ ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    Latest articles

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి....

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    More like this