అక్షరటుడే, వెబ్‌డెస్క్ : WTC Final | టెస్ట్ క్రికెట్‌కి ప్రాముఖ్యత కల్పించే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల పాటు లీగ్ దశలో ఫైట్ చేసి ఆ తర్వాత అగ్ర స్థానంలో ఏ రెండు జట్లు స్థానం సంపాదించుకుంటాయో వారే ఫైనల్ ఆడతారు. ఇక ఈ సంవత్సరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నేటి(జూన్ 11) నుంచి ఇంగ్లాండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో (Lord ground) ప్రారంభం కానుంది. ఈసారి ఫైనల్‌కు ఆస్ట్రేలియా (Australia), దక్షిణాఫ్రికా (South Africa) జట్లు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఫైటర్ హోరా హోరీగా ఉండనుంది.
WTC Final | పోటా పోటీ..
ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. జూన్ 11 నుంచి 15 వరకు జరిగే ఈ మ్యాచ్‌కు జూన్ 16ను రిజర్వ్ డేగా కేటాయించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. గత ఫైనల్‌లో భారత్‌ను (India) ఓడించి టైటిల్‌ను గెలుచుకున్న ఆసీస్ (Australia), ఈసారి కూడా అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్. సుదీర్ఘ కాలంగా ఐసీసీ టోర్నీలలో (ICC tournaments) ట్రోఫీని గెలవని సఫారీలు, ఈసారి ఎలాగైనా చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉన్నారు. టెంబా బవుమా (Temba Bavuma) కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా జట్టులో కగిసో రబాడ, లుంగీ ఎంగిడి, మార్కో యాన్సెన్ వంటి ప్రపంచ స్థాయి పేసర్‌లు మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వారు సమిష్టిగా రాణిస్తే కప్ కొట్టడం పెద్ద సమస్య ఏమి కాదు.
విజేత జట్టుకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు 30.88 కోట్ల రూపాయలు) లభించనున్నాయి. ఇది ఆటగాళ్లకు, దేశాలకు మరింత ప్రేరణను ఇస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) కోసం ఏర్పాటు చేసిన లార్డ్స్ (Lords) పిచ్ పొడిగా ఉంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు సహకరించనుంది. పిచ్‌పై పచ్చదనం ఉన్న నేపథ్యంలో ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ (final match) అత్యంత ఉత్కంఠగా సాగడం ఖాయం. ఇరు జట్లు తమ బలాబలాలను ప్రదర్శించి, టెస్ట్ క్రికెట్ నిజమైన స్ఫూర్తిని చాటుతాయి. చివరికి ఏ జట్టు గెలిచి టెస్ట్ క్రికెట్ మకుటాన్ని ధరిస్తుందో చూడాల్సి ఉంది.