అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ మార్కెట్లలోనూ ర్యాలీ కొనసాగింది. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవగా.. ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ(S&P) 0.31 శాతం పెరగ్గా.. నాస్‌డాక్ 0.21 శాతం లాభపడింది. బుధవారం ఉదయం శాతం లాభంతో కదలాడుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. డీఏఎక్స్(DAX) 0.78 శాతం నష్టపోగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.23 శాతం, సీఏసీ 0.16 శాతం పెరిగాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం పాజిటివ్‌గా ఉన్నాయి. హంగ్‌సెంగ్ (Hang Seng) 0.73 శాతం పెరగ్గా.. కోస్పీ 0.66 శాతం, నిక్కీ 0.45 శాతం, షాంఘై 0.45 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.44 శాతం లాభాలతో ఉన్నాయి. స్ట్రేయిట్స్ టైమ్స్ మాత్రం 0.41 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.16 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు(FII) నికరంగా రూ. 2,301 కోట్ల విలువైన స్టాక్స్, డీఐఐలు రూ. 1,113 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.01 నుంచి 0.97 కు తగ్గింది. విక్స్(VIX) 4.61 శాతం తగ్గి 14.02 వద్ద ఉంది. పీసీఆర్, విక్స్ స్థాయిలు బుల్స్‌ను అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.24 శాతం తగ్గి 64.82 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 4 పైసలు బలపడి 85.61 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.04 శాతం పెరిగి 99.14కు, యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.25 శాతం తగ్గి 4.47 కు చేరాయి.
- అమెరికా(America), చైనా మధ్య రెండు రోజులపాటు వాణిజ్య చర్చలు జరిగాయి. దీనిపై అమెరికా, చైనా అధికారులు సానుకూల ప్రకటనలు చేసినా చర్చల సారం కోసం మార్కెట్లు నిరీక్షిస్తున్నాయన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. అయితే యూఎస్, చైనా(China)ల మధ్య చర్చలపై ఆయా దేశాల ప్రతినిధులు సానుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి.
- భారత్, ఈయూ(EU)ల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. భారత్(Bharath), యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, బ్యాలెన్స్‌డ్ అగ్రిమెంట్ కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.