అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చర్లపల్లి జైలు ప్రాంతంలోని 58 ఎకరాల చెరువును ఆధునికీకరించడంతో పాటు సుందరీకరణకు హైడ్రా(Hydraa) సహకారం కావాలని జైళ్ల విభాగం డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా(Director General of Prisons Soumya Mishra) కోరారు. ఈ మేరకు హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్(commissioner AV Ranganath)ను కలిసి చర్లపల్లి జైలు(Charlapalli jail) ప్రాంతంలో ఉన్న చెరువు వీడియోలను ప్రదర్శించారు.
హైదరాబాద్ మహా నగరంలో చెరువుల పునరుద్ధరణ (restoration), సుందరీకరణ(beautification) పనులు చేస్తున్న హైడ్రాను సౌమ్య మిశ్రా అభినందించారు. చర్లపల్లి ప్రాంతంలో ఉన్న 58 ఎకరాల చర్లపల్లి చెరువును అభివృద్ధి చేయడంలో హైడ్రా పూర్తి సహకారం కావాలన్నారు.
హకీంపేట నుంచి ఆరేడు గొలుసుకట్టు చెరువులతో అనుసంధానమైన చర్లపల్లి చెరువులో మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలా ఉందని హైడ్రా ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. ఈ చెరువు చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల మేర నడక దారి అందుబాటులోకి వస్తుందన్నారు.
చుట్టూ పాత్‌వే(pathway), మినీ ఉద్యానాలు(mini gardens), చెట్లు(trees), సీటింగ్ సౌకర్యం(seating facilities) కల్పించడంతో పాటు.. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. చర్లపల్లి పరిశ్రమల ప్రతినిధులు సామాజిక బాధ్యత కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని సౌమ్య మిశ్రా తెలిపారు.
స్పందించిన కమిషనర్ ఏ వీ రంగనాథ్ అప్పటికప్పుడు చెరువు అభివృద్ధి బాధ్యతను హైడ్రా అధికారులకు అప్పగించారు. త్వరలోనే చెరువును సందర్శిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగరంలో మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధికి సంబంధించిన వీడియోలను హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా చూపించారు.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల పరిరక్షణ కోసం హైడ్రా చేస్తున్న కృషిని సౌమ్య మిశ్రా అభినందించారు.