అక్షరటుడే, అమరావతి: Group-1 Mains Results : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గత నెల(మే నెల) 3 నుంచి 9 వరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం చేపట్టింది. నెల రోజుల్లోనే మెయిన్స్ పరీక్ష ఫలితాల విడుదల చేయడం గమనార్హం.
మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష(prelims exam) నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు దాదాపు నాలుగు వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇక, జూన్ 23 నుంచి 30 వరకు గ్రూప్ -1 ఇంటర్వ్యూ(Group-1 interviews)లు నిర్వహించనున్నారు.