అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ(Delhi)కి బయలు దేరారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లారు.
ఈ క్రమంలో భట్టికి అధిష్టానం నుంచి పిలుపు రావడం గమనార్హం. కొత్త మంత్రుల పోర్ట్ ఫోలియో, మంత్రిత్వ శాఖల మార్పు వంటి అంశాలపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. మంత్రుల శాఖల్లో మార్పులు చేసే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ, ఖర్గేను ఉత్తమ్, భట్టి కలవనున్నారు.