అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలోని పలు హోటళ్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు (State Food Safety Officers) మంగళవారం ఆకస్మిక దాడులు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ జోనల్ అసిస్టెంట్, ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి (V Jyotirmayi) ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ రోహిత్ రెడ్డి, శ్రీషిక, స్వాతి, జగన్నాథ్ బృందం జిల్లాలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టింది. సదాశివ నగర్ మండలంలోని (Sadashiva Nagar mandal) పోసానిపేటలో వైష్ణవి ఫ్లోర్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, నోటీసులు జారీ చేశారు. రూ. 28 లక్షల విలువైన లేబుల్, ప్యాకింగ్ వివరాలు లేని శనగపప్పు శాంపిల్స్ సేకరించారు. టేక్రియాల్ బైపాస్ వద్ద గల పర్ణిక ప్యాలెస్, కామారెడ్డి పట్టణంలోని వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్, వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెంట్ ను తనిఖీ చేసి నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే నోటీసులు జారీ చేశారు.
