ePaper
More
    HomeతెలంగాణCabinet Expansion | ఆగని మంత్రి పదవుల రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతుల కీలక వ్యాఖ్యలు

    Cabinet Expansion | ఆగని మంత్రి పదవుల రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతుల కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Expansion | మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) దంపతులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యే బర్త్​ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి అనురాధ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తొక్కేశామని కొందరు సంతోష పడుతున్నారు. కవ్వంపల్లి (Kavvampalli) ఎంత తొక్కితే అంత ఎదుగుతారు” అని వ్యాఖ్యానించారు. “రాష్ట్ర స్థాయిలో తన సేవలు అవసరం లేదని ఆ దేవుడు అనుకున్నాడేమో” అని సత్యనారాయణ అన్నారు.

    రాష్ట్రంలో ఇటీవల మూడు మంత్రి పదవులను (ministerial posts) భర్తీ చేసిన విషయం తెలిసిందే. పదవుల భర్తీకి ముందు కేబినెట్​లో (Cabinet) తమకు అవకాశం కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సీఎంతో పాటు అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్​కు (Adluri Laxman Kumar) మంత్రి పదవి కేటాయించారు. అయితే ముందు కవ్వంపల్లి సత్యనారాయణకు (Kavvampalli Satyanarayana) మంత్రి పదవి కన్ఫర్మ్​ అయినట్లు వార్తలు వచ్చాయి. తీరా లక్ష్మణ్​కుమార్​కు మినిస్టర్​ పోస్ట్​ ఇవ్వడంతో కవ్వంపల్లి దంపతులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డిని (MLA Malreddy Ranga Reddy) పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​, మంత్రి శ్రీధర్​భాబు బుజ్జగించారు. బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి (Bodhan MLA Sudarshan Reddy) మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్​ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మంగళవారం నియోజకవర్గంలో నిరసనలు తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...