అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం (Thunderstorm) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. సోమవారం రాత్రి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల దాటికి వందలాది చెట్లు నేలకూలాయి. ఎన్నో విద్యుత్ స్తంభాలు (Electric Poles) విరిగిపడిపోయాయి. మంగళవారం సాయంత్రం వరకు శ్రమించి సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నేడు మరోసారి గాలివాన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తీవ్రమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచి 12 గంటల సమయంలో వర్షాలు పడుతాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్య, తూర్పు తెలంగాణ భారీ వాన పడుతుందని అధికారులుపేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది.