Job Mela
Job Mela | 12న ఉద్యోగ మేళా

అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్​ రావు (Employment Officer Madhusudhan Rao) తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్​లో (Muthoot Finance​) ప్రొఫెషనరీ ఆఫీసర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్న్​షిప్​ ట్రైయినీగా (Internship Trainee) ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10:30 గంటలకు శివాజీ నగర్​లోని ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు.