అక్షరటుడే, వెబ్‌డెస్క్: HDFC bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC bank) తన కస్టమర్లకు షాకుల మీదు షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను (Intrest rates) తగ్గించిన ఆ బ్యాంక్.. తాజాగా సేవింగ్స్ అకౌంట్లపైనా (Savings Accounts) వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ(RBI) కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక కార్యకలాపాల వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం.. డిపాజిట్ల(Deposit)లో పెట్టుబడి పెట్టేవారికి మాత్రం నిరాశను మిగులుస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ(Private sector) బ్యాంక్‌ల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ.. ఖాతాదారులను నిరుత్సాహ పరిచే చర్యలు తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు సేవింగ్స్ అకౌంట్స్(Savings accounts)పైనా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు(Basis points) తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6 శాతంనుంచి 5.5 శాతానికి తగ్గింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. HDFC bank ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించగా తాజాగా సేవింగ్స్ అకౌంట్ లపైనా వడ్డీని తగ్గించింది. ఈ నిర్ణయం మంగళవారమే అమలులోకి వచ్చింది.
HDFC bank | ఎఫ్‌డీ రేట్లు ఎంత తగ్గాయంటే..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ పౌరులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(రూ. 3 కోట్లలోపు) గరిష్టంగా 6.85 శాతం వరకు వడ్డీ చెల్లించేది. దీనిని 6.60 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్ల(Senior citizens)కు అందించే వడ్డీని 7.35 శాతంనుంచి 7.10 శాతానికి కుదించింది. కొత్త రేట్ల ప్రకారం 7 నుంచి 29 రోజుల వరకు చేసే డిపాజిట్లపై సాధారణ పౌరులకు 2.75 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం వడ్డీ(Interest) లభిస్తుంది.
- 31 నుంచి 45 రోజుల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75శాతం వడ్డీ చెల్లిస్తారు.
- 46 నుంచి 89 రోజుల వరకు గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీ అందిస్తారు.
- 181 రోజుల నుంచి 9 నెలలలోపు డిపాజిట్లకు సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ లభిస్తుంది.
- 9 నెలల నుంచి సంవత్సరంలోపు ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ వర్తిస్తుంది.
- సంవత్సరం నుంచి 15 నెలలలోపు డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ ఇస్తారు.
- 15 నెలల నుంచి 21 నెలలలోపు ఎఫ్‌డీలకు సాధారణ పౌరులకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ అందిస్తారు.
HDFC bank | సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లు..
సేవింగ్స్ ఖాతాలపై తగ్గించిన వడ్డీ రేట్లు(Interest rates) మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్(Balance)లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గింది. కాగా రూ. 50 లక్షలలోపు నిల్వలపై వడ్డీ రేటును యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే 2.75 శాతం వడ్డీ అందనుంది. ఇదే సమయంలో రుణ రేట్లను కూడా బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది లోన్లు తీసుకునేవారికి కాస్త ఊరటనిస్తుంది.